మెదక్.తూప్రాన్.24 వై సెవెన్ న్యూస్
తూప్రన్ మున్సిపల్ లోని 7వ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో కృష్ణాష్టమి ఘనంగా జరుపుకోవడం జరిగింది. కృష్ణ భగవానుడి జన్మదిన సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి టీచర్ ఇందిరా, పిల్లల తల్లిదండ్రులు కలిసి చిన్నపిల్లలను కృష్ణుడు,గోపికల వేషధారణ వేసి సుందరంగా అలంకరించి కృష్ణుడు, గోపిక లను మధ్యలో నిలబెట్టి చుట్టూ చిన్న పిల్లలు తిరుగుతూ జై జై కృష్ణ గోపాల కృష్ణ అంటూ ఆటపాటలతో ఆడుతూ సంబరంగా ఘనంగా కృష్ణాష్టమి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, ఆయమ్మ , పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 75









