తూప్రాన్ ఆగస్టు12 వై7 న్యూస్ ప్రతినిధి;
తూప్రాన్ మున్సిపల్ 15వ వార్డు లోని 7 నెంబర్ అంగన్వాడి కేంద్రంలో సిహెచ్ సి వైద్య బృందం, ఆశా వర్కర్లు, వైద్య శిబిరం ఏర్పాటు చేసి బిపి, షుగర్ పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయడం జరిగింది. వర్షాకాలపు సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని సిహెచ్ సి వైద్యులు, ఆశ వర్కర్లు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో , ఆశ వర్కర్ లు , అంగన్వాడీ టీచర్ ఇందిరా, కాలనీ వాసులు , తదితరులు పాల్గొన్నారు.
Post Views: 294