E-PAPER

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్ జిల్లా

వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం నందు శంకర నేత్రాలయ కంటి వైద్యశాల మరియు నాట్య జ్యోతి కూచిపూడి డ్యాన్స్ వారి ఉచిత కంటి పొర చికిత్స శిబిరం వారి సహకారంతో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణ ప్రజలందరూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థల ఆధ్వర్యంలో కంటి చూపు మందగించినవారు కంటి సమస్యలు ఉన్నవారు నిపుణులైన డాక్టర్లు ఉన్నారు వారి చేత చూయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే ఆపరేషన్ చేయడానికి కూడా వారి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ ఒక గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు….

తదనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మున్సిపల్ కార్మికురాలిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగింది…..

ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ కంటి వైద్యశాల మరియు నాట్య జ్యోతి కూచిపూడి డ్యాన్స్ సంస్థల అధినేతలు, ఆర్గనైజర్లు, డాక్టర్లు సిబ్బంది తోపాటు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News