జడ్పిటిసిల పాలకవర్గం సభ్యుల సన్మాన కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉన్నతాధికారులు,ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు
*పదవికి మాత్రమే విరమణ… ప్రజాసేవకు కాదు
*ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించడం నా అదృష్టం… బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ ఆదివారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం తో పాటు జిల్లా పాలకమండలి సభ్యులుగా వచ్చే నెల 6 వ తేదీ నాడు 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర రావు గారి అధ్యక్షతన జడ్పిటిసిల పాలకవర్గం సభ్యుల సన్మాన కార్యక్రమానికి జిల్లా శ్రీ కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ , కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు , ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య , వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ సన్మాన కార్యక్రమానికి హాజరై బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత తో పాటు పలువురు ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ ప్రజలు తమకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పరిపాలనకు సహకరించిన అధికారులు పార్టీ నాయకులకు ఆమె పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, ఐదు సంవత్సరాలు గ్రామాల అభివృద్ధికి అధికారులు ఎంతో సహకరించారని కొనియాడారు,ప్రతి ప్రజా ప్రతినిధి అయిదు సంవత్సరాలకు తన పదవికి వీడ్కోలు పలకగ తప్పదని ఆమె వివరించారు, కరోనా మహమ్మారి తో పాటు గోదావరి వరదలకు అప్పుడు కూడా మండల అధికారులు పార్టీ శ్రేణులతో కలిసికట్టుగా తమ వంతు సహాయ సహకారాలు అందించామని ఆమె అన్నారు, ప్రజా సేవ చేయాలని సంకల్పంతో రాజకీయాలకు వచ్చి ప్రజాప్రతినిధులు గా ఎన్నికైన వారికి మాత్రమే పదవీ విరమణ ఉంటుందని ప్రజాసేవకు కాదని ఆమె అన్నారు*చివరి పాలకవర్గ సమావేశంలో బూర్గంపాడు మండలంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు వైద్యం పరిశుద్ధ అంశాల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, సత్వరమే అధికారులు ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.









