E-PAPER

రజనీ ‘ధర్మన్’లో రామ్..! ఆ ఫొటోతో బయటపడ్డ అసలు విషయం..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ నుంచి నటి రాశీ ఖన్నా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలలో రజనీకాంత్‌తో పాటు టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లో ఆయన నటిస్తున్నారన్న వార్తలకు స్పష్టత వచ్చినట్లయింది.

మైసూర్‌లోని తన దినచర్య గురించి రాశీ ఖన్నా తన పోస్ట్‌లో సరదాగా రాసుకొచ్చారు. “కొంతకాలంగా నేను మైసూర్‌లో గడుపుతున్న ప్రపంచం నుంచి చిన్న గ్లింప్స్‌.. తెల్లవారుజామునే రజనీ సర్, రామ్‌తో కలిసి వర్కౌట్స్. కొన్ని ఆలయాల సందర్శన, కొద్దిగా తిరగడం, కాస్త ఆట, చాలా నవ్వులు. ఇక, మైసూర్ దోశకు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే. #dharman” అని రాశీ ఖన్నా పేర్కొన్నారు.

కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధర్మన్’ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనుండగా, సిమ్రాన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

చెన్నైలో మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, ప్రస్తుతం మైసూర్‌లో నాలుగో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. మైసూర్‌లో దాదాపు 10 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!