E-PAPER

108 సిబ్బంది చొరవతో మహిళకు పునర్జీవం

అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండAdd titleలం మల్లెలమడుగు గ్రామంలో అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ మహిళకు 108 సిబ్బంది సకాలంలో ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

మల్లెలమడుగు గ్రామానికి చెందిన బోడ వరలక్ష్మి అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ జీ. పుల్లయ్య, పైలట్ జీ. రమేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈఆర్‌సీపీ డాక్టర్ శివ సూచనల మేరకు అపస్మారక స్థితిలో ఉన్న వరలక్ష్మికి 108 సిబ్బంది చాకచక్యంగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సకాలంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సకాలంలో వైద్యం అందడంతో వరలక్ష్మి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!