E-PAPER

Y7 కథనానికి స్పందన.. వృద్ధురాలికి న్యాయం చేస్తానన్న ఎమ్మార్వో

వారసత్వ పట్టా తనకు కాకుండా చేశారంటూ లాలమ్మ ఆవేదన

భూమిపై విచారణ జరిపి.. వారసత్వ కుటుంబ సభ్యులందరినీ పిలిపిస్తామని హామీ

సుజాతనగర్, సెప్టెంబర్ 24:

వారసత్వ భూమికి సంబంధించిన పట్టా తనకు కాకుండా మారిపోయిందని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధురాలు శనగ లాలమ్మకు న్యాయం చేస్తామని సుజాతనగర్ మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) హామీ ఇచ్చారు.సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన శనగ లాలమ్మ తనకు రావాల్సిన వారసత్వ భూమికి సంబంధించిన పట్టా విషయంలో అన్యాయం జరిగిందని పేర్కొంటూ అధికారులను ఆశ్రయించారు. ఈ అంశంపై Y7లో కథనం ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించినట్లు సమాచారం.భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సమగ్రంగా ఎంక్వైరీ నిర్వహిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. అలాగే సంబంధిత వారసత్వ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి వారి వాదనలు తెలుసుకున్న అనంతరం నిబంధనల ప్రకారం భూమి హక్కు విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు లాలమ్మ కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన హామీ మేరకు విచారణ ఎప్పుడు నిర్వహిస్తారు? వారసత్వ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి రికార్డులను పరిశీలించిన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది వేచి చూడాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!