E-PAPER

Breaking News ; తిరుపతిలో APSRTC కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి: APSRTC కార్యాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ సి.ఎస్. వర్మ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది.డీపీటీవో (DPTO) కార్యాలయంలోని తన చాంబర్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఉద్యోగి బదిలీ విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో సుమారు మూడు నెలల క్రితం ఉన్నతాధికారులు వర్మను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.వర్మ ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!