E-PAPER

విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి ; తల్లి, కుమారుడి మృతిపై మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ సంతాపం

బాపట్ల: బాపట్ల మండలం చెరువుపాలెం గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై తల్లి రమాదేవి, ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు మృతి చెందిన ఘటనపై మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు అన్నం సతీష్‌ ప్రభాకర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.

వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ వైర్లు, చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వర్షాల సమయంలో తెగిపడిన విద్యుత్‌ వైర్లు, తడిగా ఉన్న విద్యుత్‌ పరికరాలను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

విద్యుత్‌ శాఖ అధికారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నం సతీష్‌ సూచించారు. గాలులు, వర్షాలు తీవ్రంగా ఉన్న సమయంలో సిబ్బందిని గ్రామాలు, వార్డుల్లో అందుబాటులో ఉంచి విద్యుత్‌ స్తంభాలు, వైర్లను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

అదేవిధంగా విద్యుత్‌ శాఖతో పాటు అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రజలకు విద్యుత్‌ వైర్లు, స్తంభాలు, విద్యుత్‌ పరికరాల వల్ల సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచించారు. చెరువుపాలెం గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రమాదేవి, వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!