E-PAPER

Y7 News Telugu కథనానికి స్పందించిన జాయింట్ కలెక్టర్ ; ఇప్పటికే తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి

సుజాతనగర్, సెప్టెంబర్ 24 (Y7 News Telugu):
సుజాతనగర్ మండలం పాత నిమ్మలగూడెం పరిధిలోని వారసత్వ భూముల పట్టాల మార్పు వ్యవహారంపై Y7 News Telugu ప్రచురించిన కథనానికి జాయింట్ కలెక్టర్ స్పందించారు.

సర్వే నంబర్లు 1073, 1084, 1090, 1109కు సంబంధించిన భూముల విషయంలో పహాణీ రికార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉండగా, ప్రస్తుతం పట్టా ఒక్కరి పేరుపైకి ఎలా మారిందనే అంశంపై వృద్ధురాలు శనగ లాలమ్మ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై స్పందించిన జాయింట్ కలెక్టర్.. “Already informed to the Tahsildar” అని పేర్కొన్నారు. అంటే, ఈ వ్యవహారంపై ఇప్పటికే సంబంధిత తహసీల్దార్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు.

దీంతో ఈ భూములకు సంబంధించిన పాత పహాణీలు, ప్రస్తుత రెవెన్యూ రికార్డులు, పట్టా మార్పు దరఖాస్తులు, సంబంధిత పత్రాలు, వారసత్వ హక్కులకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలిస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

రికార్డుల పరిశీలనతోనే స్పష్టత

కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారా? పట్టా మార్పు ఏ దరఖాస్తుపై జరిగింది? ఏ ఆధారాలతో రికార్డుల్లో మార్పులు చేశారు? అనే ప్రశ్నలకు అధికారిక రికార్డుల పరిశీలన అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అలాగే పట్టాల మార్పులో డబ్బుల లావాదేవీలు జరిగాయని బాధితులు చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది సంబంధిత అధికారుల పరిశీలన లేదా విచారణలో తేలాల్సి ఉంది.

Y7 News Telugu కథనానికి జాయింట్ కలెక్టర్ స్పందించి, ఇప్పటికే తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించడంతో.. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై బాధితులు, స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!