శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 News Telugu
నరసన్నపేట మండలం జమ్మూ జంక్షన్ వద్ద శనివారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
విజయవాడ నుంచి టెక్కలి వెళ్తున్న KVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి సురక్షితంగా కిందకు దిగారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
మంటల తీవ్రతకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనతో జమ్మూ జంక్షన్ పరిసరాల్లో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 48









