చింతూరు,( వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. నిరుద్యోగ మహిళలకు అండగా నిలవాల్సిన అధికారులు, పాలకులు తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ అభాసుపాలవుతున్నారు. అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసి, వేలాది మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికార యంత్రాంగం.. ఇంటర్వ్యూల నిర్వహణకు వచ్చేసరికి మాత్రం ‘కళ్ళుండి కబోది’లా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని సెంటర్లకు కాకుండా, కేవలం కొన్ని ఎంపిక చేసిన సెంటర్లకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించడం వెనుక అసలు అంతర్యమేమిటో అధికారులు తెలుపాలని కోరుతున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అన్ని అంగన్వాడీ సెంటర్ల అభ్యర్థులకు చేసి, ఇప్పుడు కొంత మంది అభ్యర్ధులను ఇంటర్యూ ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.









