సోషల్ మీడియాలో ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నందన ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. సుమారు 28 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో కనిపించి వెండితెరపై కూడా సందడి చేశారు.
యూట్యూబ్‌లో తన వీడియోలు, కంటెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందనకు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినిమాల్లోకి కూడా అడుగుపెట్టడంతో ఆమెకు సంబంధించిన విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇంతలోనే ఆమె చుట్టూ ఓ అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది.
ఈ వివాదానికి సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నందనపై వచ్చిన ఆరోపణలు, వివాదానికి దారితీసిన అంశాలపై నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు. దీంతో ‘నందూస్ వరల్డ్’ నందన పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వార్తల్లో నిలిచింది.









