E-PAPER

స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో టెక్నో సంచలనం.. 0mm బెజెల్స్‌తో కొత్త కాన్సెప్ట్ ఫోన్!

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే డిజైన్‌లో మరో కొత్త ప్రయోగానికి టెక్నో సిద్ధమైంది. స్క్రీన్ చుట్టూ సాధారణంగా కనిపించే బెజెల్స్‌ను పూర్తిగా తొలగించి, 0mm డిస్‌ప్లే బోర్డర్‌తో కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ పరిచయం చేయనుంది. నెక్స్ట్-జెన్ బెజెల్‌లెస్ కాన్సెప్ట్ ఫోన్‌ను IFA 2026లో ప్రదర్శించనున్నట్లు టెక్నో అధికారికంగా ప్రకటించింది.

టెక్నో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కాన్సెప్ట్ ఫోన్‌లో డిస్‌ప్లే, ఫ్రేమ్ మధ్య కనిపించే నల్లటి బోర్డర్‌ను పూర్తిగా తొలగించారు. ఇందుకోసం అడ్వాన్స్‌డ్ ఇంటర్నల్ స్టాకింగ్, కొత్త స్క్రీన్ ప్యాకేజింగ్ టెక్నిక్స్, స్ట్రక్చరల్ రీ-ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఫోన్ ముందు భాగం దాదాపు మొత్తం డిస్‌ప్లేతోనే కనిపించే అవకాశం ఉంది.

మరోవైపు ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ కూడా ఈ కాన్సెప్ట్ ఫోన్‌కు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజమైన 0mm డిస్‌ప్లే బోర్డర్‌తో వస్తున్న పరిశ్రమలోనే తొలి స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌గా దీనిని ఆయన అభివర్ణించారు. అయితే ఇది ప్రస్తుతం కాన్సెప్ట్ ఫోన్ మాత్రమే కావడంతో.. ఈ టెక్నాలజీని భవిష్యత్ కమర్షియల్ స్మార్ట్‌ఫోన్లలో టెక్నో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!