E-PAPER

పాకిస్థాన్‌లో ఘోర గని ప్రమాదం.. భారీ పేలుడులో 32 మంది కార్మికులు మృతి

నైరుతి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వెట్టా శివార్లలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో కనీసం 32 మంది కార్మికులు మృతి చెందారు. మరో 10 మంది కార్మికులు గని లోపల చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఈ ప్రమాదానికి గనిలో మీథేన్ గ్యాస్ పేరుకుపోవడమే కారణమై ఉండవచ్చని ప్రభుత్వ మైన్ ఇన్‌స్పెక్టర్ ఘనీ బలోచ్ వెల్లడించారు.

పేలుడు అనంతరం గనిలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే రెస్క్యూ సిబ్బంది మొదట ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మరో 25 మృతదేహాలను గుర్తించడంతో మృతుల సంఖ్య 32కి చేరింది. గని లోపల ఇంకా పలువురు చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

గని లోపల పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది అప్రమత్తంగా ముందుకు సాగుతున్నారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉండటంతో లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News