పలాస ;
శ్రీకాకుళం జిల్లా రైల్వే రంగ అభివృద్ధిలో నేడు చారిత్రాత్మక రోజుగా నిలిచింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఆరు రైల్వే హాల్ట్‌లకు మంజూరు లభించడం గర్వకారణంగా మారింది.
ఈ సందర్భంగా హరిశ్చంద్రపురం వద్ద విశాఖ–గుణపూర్ పాసింజర్ రైలు, మందస రోడ్డు వద్ద బ్రహ్మపూర్–విశాఖపట్నం రైలు, పాతపట్నం వద్ద రూర్కెల–గుణపూర్ రాజ్యరాణి రైళ్లకు హాల్ట్‌లను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహరా, ఖుర్ధా రోడ్ డివిజన్ డీఆర్‌ఎం సునీల్ కలిసి ప్రారంభించారు.
ఈ కొత్త హాల్ట్‌లు గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
అదేవిధంగా జిల్లాలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తూ, రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.








