అశ్వాపురం: మొండికుంటలోని పోలింగ్ కేంద్రాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి నేటి ఉదయం పరిశీలించారు. అనంతరం అక్కడి పోలింగ్ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ సమయంలో విచ్చేసే ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే, క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనలకు కట్టుబడి పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Post Views: 107









