E-PAPER

క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే జరపాలి: ఎంపీడీవో సంకీర్త్

కరకగూడెం, నవంబర్ 12( Y7 న్యూస్ తెలుగు):ఇందిరమ్మ ఇంటి సర్వే అనేది తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిరాశ్రయులైన సొంత ఇల్లు లేని పేదల కోసం చేపట్టిన ఒక కార్యక్రమం అని కరకగూడెం ఎంపీడీవో దేవ వర కుమార్ అన్నారు. బుధవారం కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెక్రటరీలు, ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వేను నిర్వహిస్తోందన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఈ సర్వే జరుగుతుందన్నారు. సెక్రటరీలకు మొబైల్ యాప్ ద్వారా వచ్చిన పూర్తి సర్వేను పూర్తి చేయాలని కోరారు. వారం రోజుల్లో గా ఈ సర్వేను పూర్తి చేసి పూర్తి నివేదిక అందజేయాలని కోరారు.
మొబైల్ యాప్‌ను ఉపయోగించి క్షేత్రస్థాయిలో సర్వే జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మారుతీ, ఏపిఓ భాస్కర్, గ్రామపంచాయతీ సెక్రటరీలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News