E-PAPER

వెంకటాయిపల్లి లో నూతన పోస్టాఫీసు ను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావ్

ముందుగా తూప్రాన్ మహంకాళి దేవాలయం లో ప్రత్యేక పూజలు

కేసిఆర్ కూతురు కవిత పార్టీ పెట్టడం ఓ పెద్ద డ్రామా

తెలంగాణలో ప్రజాధనాన్ని 10 సంవత్సరాల పాటు కొల్లగొట్టారు

ఇప్పుడు సామాజిక తెలంగాణ పేరుతో రెండవ పార్టీగా కవిత అవతారం

తూప్రాన్, మే 27. వై సెవెన్ న్యూస్

తూప్రాన్ లోని శ్రీశ్రీశ్రీ ఉజ్జయిని మహాకాళీ దేవాలయం లో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కిష్టాపూర్ గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద ఆయనకు కిష్టాపూర్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వెంకటాయపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ పోస్టాఫీసును ఎంపీ రఘునందన్ రావు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వెంకటాయిపల్లి లో పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలని తాజా మాజీ సర్పంచ్ లంబ వెంకటమ్మ కుమారుడు లంబ రమేష్ యాదవ్ ప్రజలు కోరగా పోస్ట్ ఆఫీసులను మంజూరు చేయడం జరిగిందన్నారు. పోస్ట్ ఆఫీస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల అవసర నిమిత్తం అనేక స్కీములను కల్పించారన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు సుకన్యా యోజన, పి ఎం జె వై, రెండు రూపాయల స్కీము ఇలా అనేక ఆసక్తికర పథకాలను ప్రవేశపెట్టాడని పేర్కొన్నారు. వాటిని పల్లెటూరి ప్రజలు సద్వినియోగ పర్చు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి ప్రెసిడెంట్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గజ్వేల్ ఇన్చార్జి సాయి, సర్పంచ్ ల ఫోరం తాజా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ నర్సోజి, కంటాయపాలెం వేణుగోపాల్, తాటి విట్టల్, మున్సిపల్ ప్రెసిడెంట్ జానకి రాం గౌడ్, లంబ రమేష్, పిట్ల పోచయ్య, మధుసూదన్ రెడ్డి, సంఖ్య యాదగిరి, నరసింహ రెడ్డి, మధు, శ్రీనివాస్, గట్టు అమర్ గుప్త, మనోహర బాద్ ఆయిలయ్య యాదవ్, పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!