మణుగూరు, మే 24, వై 7 న్యూస్;
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొదేం వీరయ్య ఆదేశానుసారం, జిల్లా కాంగ్రెస్ నాయకుడు గురజాల గోపి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గురజాల గోపి మాట్లాడుతూ, “మహేష్ కుమార్ గౌడ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అధిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండి నూరుద్దీన్, ఎండి షరీఫ్,పింగళి మాధవరెడ్డి, మహిళా నాయకులు పూనెం సరోజ, కోరి శ్యామల, రేణుక, సౌజన్య, రమ, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 129