గోవిందరావుపేట వై7 న్యూస్
అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న బొజ్జ మహేష్…
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు…
ఇంటి పెద్ద కుప్పకూలడంతో ఏం చేయలేని పరిస్థితి…
మానవతా వాదులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఆదుకుంటారేమో అని ఎదురుచూపులు…
గోవిందరావుపేట మండల కేంద్రంలోని తారకరామ కాలనీకి చెందిన బొజ్జ మహేష్, తండ్రి: పోషాలు,అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు, రోజు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఇంటి పెద్దకు ఆపదొచ్చింది. అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని గాంధీ ప్రభుత్వ వైద్యశాల యందు వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాడు. చేతిలో రూపాయి లేక ప్రైవేట్ వైద్యశాల యందు వైద్యం చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో బొజ్జ మహేష్ భార్య బొజ్జ చైతన్య దాతలు ఎవరయినా సహాయం చేయండి అని వేడుకుంటుంది. గత ఎనిమిది నెలల నుండి చర్మంపై, నాలుకపై పొక్కులు రావడంతో హన్మకొండలోని పలు ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేకుండా పోయింది. కాగా హైదరాబాద్ లోని గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి నాలుగు నెలల నుండి చికిత్స చేయిస్తున్నారు. అయిన కూడా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం మాత్రం లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత వాళ్ళ దగ్గర లేదని, ఎవరైనా దాతలు, మానవతా వాదులు, ప్రభుత్వ అధికారులు, పాలకులు స్పందించి సహాయం చేయాలని, దాతలు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించి ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టి, పేద కుటుంబాన్ని ఆదుకోవాలని మహేష్ భార్య చైతన్య దాతలను వేడుకుంటుంది.
వారి బ్యాంకు వివరాలు…
కెనరా బ్యాంకు, పసర బ్రాంచ్, ఖాతా నెంబర్ 6774101001909, ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్: సి.ఎన్.ఆర్.బి.0001923, ఫోన్ పే నెంబర్ 9121408124 ద్వారా దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు.