బీర్కూరు నవంబర్ 14వై 7 న్యూస్ తెలుగు
బీర్కూర్ మార్కెట్ యార్డ్ కు పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 114 మార్కెట్ యార్డ్లకు పాలకవర్గాలను నియమించింది. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన మాజీ మండల అధ్యక్షురాలు, తాజా మాజీ సర్పంచ్ దుర్గం పల్లి శ్యామలకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీర్కూర్ మండలానికి వైస్ చైర్మన్ పదవి దక్కింది. వాస్తవానికి ఉమ్మడి బీర్కూర్ మార్కెట్ యార్డ్ రొటేషన్ పద్ధతిలో ఒక టర్మ్ నసురుల్లాబాద్, మరొక టర్మ్ బీర్కూర్ కు చైర్మన్ పదవి కేటాయించవలసి ఉంటుంది. గతంలో నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన పెరిక శ్రీనివాస్ ఆయన సతీమణికి, రెండోసారి పెరిక శ్రీనివాస్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చారు, మూడవసారి బీర్కూర్ కు చెందిన మల్లాపూర్ వాసి ద్రోణవల్లి అశోక్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించారు. ఈయన నాలుగేళ్లు మార్కెట్ కమిటీగా చైర్మన్గా పనిచేశారు. రెండు సార్లు బీర్కూరు మండలం నుంచి ద్రోణవల్లి అశోక్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేయడంతో, ఈసారి మళ్లీ నసుల్లాబాద్ మండలం చెందినదుర్కి గ్రామానికి చెందిన శ్యామలకు దక్కింది. త్వరలో అధికారికంగా పాలకవర్గాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించనున్నారు.









