మణుగూరుకు వరద ముంపు విపత్తు నివారణ చర్యలు చేపట్టాలి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందజేసిన విఠల్ రావు నగర్ వాసులు
గత వారం మణుగూరులో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వరద ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని, మణుగూరుకు భవిష్యత్తులో వరద ముంపు విపత్తు నుండి కాపాడాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో విఠల్ రావు నగర్ కి చెందిన నిరుపేదలు సోమవారం నాడు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి ఎమ్మెల్యే క్యాంపర్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ గత వారం మణుగూరులో కురిసిన కుండ పోత భారీ వర్షాలకు అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయని అర్ధరాత్రి ఆకస్మిక వరద ముంపుకు అనేకమంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారని మణుగూరు చరిత్ర లోనే ఊహించని విపత్తుగా ఆయన అభివర్ణించారు. ఈ సమయంలో నిరాశ్రయలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోడిపుంజుల వాగు వరద ముంపుతో బావి కూనవరం పంచాయతీ, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని విఠల్ రావు నగర్, సుందరయ్య నగర్, ఆదర్శనగర్, మామిడి చెట్ల గుంపు, చేపల మార్కెట్ ఏరియా, బాపన కుంట, శేషగిరి నగర్, శివలింగాపురం, కోట కట్ట, రాజుపేట, తదితర ప్రాంతాలలో వరద ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. భవిష్యత్తులో మణుగూరు వరద ముప్పు నుండి నివారించేందుకు మణుగూరు పరిసర ప్రాంత ప్రజల ఇళ్లకు ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా నిపుణులతో అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంయుక్తంగా ప్రాజెక్ట్ ప్లాన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో జిల్లా మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సమస్యలు వివరించడంతోపాటు వినతి పత్రాలు కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఏరియా మున్సిపాలిటీ పరిధిలోని నిర్వాసితులు
జి విజయలక్ష్మి,సిహెచ్ పద్మ, ఎస్ మల్లేశ్వరి, ఎం రాము, ఆంగోత్ లక్ష్మి, బోలో బోయిన అలివేలు, కన్నబోయిన కృష్ణవేణి సామాజిక కార్యకర్తలు ఏ. మంగీలాల్ యూ. శివ రామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు









