నల్లగొండ,మిర్యాలగూడ,సెప్టెంబర్ 08 వై 7న్యూస్
మిర్యాలగూడ పట్టణంలో వినాయక చవితి పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు దేవాలయాలు, కాలనీలలో గణపతి విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. కోదండ రామాలయంలోని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొని పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులు పాడిపంటలతో అభివృద్ధి చెందాలని గణపతిని పూజ చేయించారు.ఆయనతో పాటు డిఎస్పి రాజశేఖర్ రాజు పాల్గొని పూజలు
నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు దేశిడి శేఖర్ రెడ్డి, రేపాల పురుషోత్తం రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, గంధం రామకృష్ణ, ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 98









