అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణపై..
నాగారెడ్డిపేట్ , ఆగస్టు: 29 వై 7 న్యూస్
జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వధికారాలు అప్పగించడంతో రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల పనితీరును పసిగట్టి వారిపై కొరడా ఝూలిపిస్తున్నారు. దీంట్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ నాగారెడ్డిపేట్ తాసిల్దార్ లక్ష్మణ్ మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణపై ఆయనను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు . జిల్లా కలెక్టర్ చర్య పై కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడతున్నాయి. ఏ సమయంలో ఏ మండలానికి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జిల్లా కలెక్టర్ చేస్తారేమోనని అధికారులు దడ మొదలైంది. ఒకవైపు ఎసిబి, మరో వైపు జిల్లా కలెక్టర్ దడ పుట్టిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ శాఖలలో అవినీతి ఆక్రమాలను సహించేది లేదని ప్రకటించిన జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ కోరడ ఝూలిపిస్తున్నారు. గురువారం నాగిరెడ్డి పేట్ తహసీల్డార్ లక్ష్మన్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి డివిజన్ లోని నాగిరెడ్డి పేట్ పేట్ తహసీల్జార్ లక్ష్మన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు తన చేతికి మట్టి అంటకుండా ప్రతి పనికి మద్యవర్తుల ద్వార వసూళ్ల పర్వానికి తెరలేపారు. తహసీల్దార్ పై అవినితి ఆరోపణలపై ఆర్డిఓ ప్రభాకర్ ద్వార విచారణ చేయించారు. అర్డిఓ నివేధికలో లక్ష్మణ్ వసూళ్ల పర్వం వాస్తవమేనని నివేధిక ఇవ్వడంతో అయనను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్.









