E-PAPER

మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ గా కోట కరుణాకర్

మిర్యాలగూడ, ఆగస్టు 29 వై 7న్యూస్;

మిర్యాలగూడ వన్ టౌన్ సి ఐ గా కోట కరుణాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పని చేసిన సుధాకర్ హైదరాబాద్ వెళ్లగా ఆయన స్థానంలో నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ లో సి ఐ గా పని చేస్తున్న కరుణాకర్ బదిలీ పై మిర్యాలగూడ వన్ టౌన్ కి వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ కి ఎస్ఐ సుధీర్ కుమార్, సిబ్బంది స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ సిబ్బంది, ప్రజల సహకారంతో వన్ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News