నిర్మల్,Y7న్యూస్; నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గట్టుమైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. బోనం కుండలతో అమ్మవారి చెంతకు చేరుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. వర్షాలు పుష్కలంగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మైసమ్మ తల్లిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా పాటుపడతానని అన్నారు. ఆయన వెంట కిసాన్ గల్లి వాసులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ గట్టు మైసమ్మ బోనాల ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు సతీష్ రావ్ తో పాటు స్థానిక బిజెపి నాయకులు ఉన్నారు.
Post Views: 201









