ములుగు జిల్లా నవంబర్ 18 Y7 న్యూస్ తెలుగు

ములుగు జిల్లా కేంద్రం లో విద్యార్థుల్లో ఓటు హక్కు ప్రాముఖ్యత ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించాలని ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి సూచించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల (ELCs) ఆధ్వర్యంలో బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఆర్డీవో కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 10 మండలాల పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదగడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు ప్రాధాన్యత అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా, ఓటరు జాబితా తయారీ, సవరణలు, ఈవీఎంలు, వీవీప్యాట్, పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై క్విజ్ పోటీల ద్వారా విద్యార్థుల అవగాహనను పరీక్షించారు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధికారులు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులోనూ ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా ఎన్నికల అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఆర్డీవో తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ విజయభాస్కర్, మండల విద్యాధికారి వజ్జ తిరుపతి, డిప్యూటీ తహసీల్దార్ నితీష్, ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల సమన్వయకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు









