E-PAPER

కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్..! అప్పుడూ ఉంది.. ఇప్పుడూ ఉంది ..

సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉన్న ‘కాస్టింగ్ కౌచ్’‌పై సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో ఈ తరహా వేధింపులు అప్పుడూ ఉన్నాయని, ఇప్పుడూ ఉన్నాయని, భవిష్యత్తులో కూడా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ దోపిడీ కేవలం ఒక పరిశ్రమకే పరిమితం కాదని, లింగ భేదం లేకుండా అన్ని రంగాల్లోనూ జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే ఎప్‌స్టీన్ ఫైల్స్ లాంటివి బయటపడ్డాయి. అక్కడ మహిళలు ఎంతో ముందున్నా అలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ జరగదని చెప్పలేం. ఇష్టంతోనో, బలవంతంగానో, మామూలుగానో.. అది జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. మనది గ్లామర్ ప్రపంచం కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. బయట కూడా ఎంతోమంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారు” అని వివరించారు.

గతంలో చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న కష్టాలను కూడా రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో ఫిల్మ్ సెట్లలో కనీసం వాష్‌రూమ్‌లు, క్యారవాన్‌లు ఉండేవి కావని తెలిపారు. బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన ప్రైవసీ ఉండేది కాదని, అంబాసిడర్ కార్లలో కూర్చుని బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేసిన సందర్భాలున్నాయని చెప్పారు. ఆ కష్టాలతో పోలిస్తే ఇప్పటి నటీనటులు చాలా అదృష్టవంతులని, తాము పడిన కష్టాల్లో పావు వంతు కూడా వారు అనుభవించలేదని అన్నారు.

ఇక, సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ఇటీవల రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్ 2’లో నటించారు. వీటితో పాటు ‘రాకా’, ‘శ్రీ శ్రీ’, ‘పాకెట్ నావెల్’, ‘తేరా యార్ హూ మే’ వంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!