E-PAPER

పటిష్టమైన దర్యాప్తుతోనే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి

బాధితులకు సత్వర, సముచిత న్యాయం అందించడమే లక్ష్యం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం: నేర పరిశోధనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నేరాలకు సంబంధించి సేకరించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో పకడ్బందీగా సమర్పించి, నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.

దర్యాప్తు సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్ష్యాలను సేకరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

నేర బాధితులకు సత్వర, సముచిత న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేసుల విచారణలో నాణ్యతను పెంపొందిస్తూ, న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు పడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!