E-PAPER

భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.. డిసెంబర్ 10 నుంచి జనవరి 2 వరకు నిర్వహణ

ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు.. అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఆలయ అధికారులు

భద్రాచలం | వై సెవెన్ తెలుగు న్యూస్

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 10, 2026 నుంచి జనవరి 2, 2027 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో వెల్లడించారు.

ఈ సందర్భంగా డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18, 2026 వరకు శ్రీరామ సేవామండపం (మిథిలా స్టేడియం) వేదికగా ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 20, 2026 నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమాలను మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవామండపంలో వివిధ మండపాల్లో నిరంతరాయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పగలంతా జరిగే కార్యక్రమాలతో పాటు ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఉత్సవాల నిర్వహణపై నవంబర్ 12, 2026న ఆలయ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలపై చర్చించి వారికి తగిన సూచనలు చేసినట్లు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. దామోదర్ రావు పేరుతో నవంబర్ 12న ప్రెస్ నోట్ విడుదల చేశారు.

వై సెవెన్ తెలుగు న్యూస్ | భద్రాచలం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!