E-PAPER

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్..

హైదరాబాదులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. ఇటీవల సినీ పరిశ్రమను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై వారు హోంమంత్రికి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఆందోళనను సావధానంగా విన్న అమిత్ షా, ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి కఠినమైన నిబంధనలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీపై చిరంజీవి, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం సంతోషంగా ఉంది. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల కళాకారుల హక్కులు, గౌరవానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్న నా ఆందోళనను ఆయనతో పంచుకున్నాను. ఆయన మా సమస్యను అర్థం చేసుకుని, ఈ అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలిస్తుందని, కఠినమైన నిబంధనలు, శిక్షలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాతపూర్వకంగా వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సమన్వయం చేస్తారని తెలిపారు. ఆయన హామీకి కృతజ్ఞతలు” అంటే చిరంజీవి ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ స్పందిస్తూ.. “ఈ రోజు నాన్నగారితో కలిసి హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. డీప్‌ఫేక్ వల్ల కళాకారులపై, పరిశ్రమపై పడుతున్న తీవ్ర ప్రభావం గురించి మేం వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించడం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన ఇచ్చిన హామీ మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. మా ఆందోళనను అర్థం చేసుకుని, మద్దతు తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు” అని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!