స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ రికార్డింగ్ పూర్తి చేసినట్టు దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా ప్రకటించారు.
ఈ పాట రికార్డింగ్‌లో ఒక అరుదైన ప్రయోగం చేశారు. భారతదేశంలోని విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే 100 మంది జానపద వాద్య కళాకారులతో కలిసి ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేశారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన కళాకారులతో కలిసి ఈ పాటను స్వరపరచడం ద్వారా సంగీత ప్రియులకు ఒక కొత్త అనుభూతిని పంచేందుకు డీఎస్పీ సిద్ధమయ్యారు. ఈ చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే పాత్రలో నటిస్తున్నారు. హీరోగా చేస్తూ, తానే సంగీతం అందిస్తుండటం విశేషం.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హన్షిత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వేణు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, డీఎస్పీ హీరోగా పరిచయం అవుతుండటంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Post Views: 6