మణుగూరు, సెప్టెంబర్ 27 (Y7 News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ 11 కేవీ ఫీడర్లో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్నందున సెప్టెంబర్ 28న (సోమవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
విద్యుత్ అంతరాయం కలిగే ప్రాంతాలు:
భగత్ సింగ్ నగర్
గాంధీ నగర్
సురక్ష బస్ స్టాండ్ ఏరియా
కాళీమాత ఏరియా
గోల్డ్ షాప్ లైన్
శేషగిరి నగర్ ప్రాంతాలు
అయితే 33/11 కేవీ గుట్టమల్లారం సబ్స్టేషన్ మరియు 33/11 కేవీ మణుగూరు సబ్స్టేషన్ పరిధిలోని ఇతర ప్రాంతాలకు ఎటువంటి అంతరాయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.
– విద్యుత్ శాఖ, మణుగూరు
Post Views: 25








