E-PAPER

పెద్దనల్లబెల్లి వినాయక మండపం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం

దుమ్ముగూడెం: మండలంలోని పెద్దనల్లబెల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలోని వినాయక మండపం వద్ద మంగళవారం రెండెండ్ల ప్రభాకర్ రెడ్డి–చిన్ని దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వినాయక స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందించి ఆతిథ్యమిచ్చారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమానికి హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మండపం వద్ద భక్తి వాతావరణం నెలకొనగా, సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ, గణనాథుడి కృపాకటాక్షాలతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందంతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించిన సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.

భక్తి, సేవాభావంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!