బూర్గంపాడు, సెప్టెంబర్ 20 (Y7 News Telugu):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఊర్ల దాచుపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. అటవీ ప్రాంతంలో మేత మేస్తున్న రెండు ఆవులు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.
స్థానికుల సమాచారం మేరకు, వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో పశువుల యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవుల విలువ లక్షల రూపాయలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
ప్రభుత్వ అధికారులు స్పందించి బాధిత పశువుల యజమానికి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 23








