E-PAPER

అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా


దమ్మపేట, సెప్టెంబర్ 20 (Y7 న్యూస్ తెలుగు):
అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు శనివారం దమ్మపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు.

మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కోర్స దాసును, పార్కలాగండి గ్రామానికి చెందిన కాక ప్రసాద్‌ను మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం సుశీల, మాజీ సర్పంచ్ మొగిలి కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య, యలమంచి చంద్రశేఖర్ రావు, శ్రీరాముల చక్రధర్ రావు, సున్నం నరేంద్ర, కొండ్రు రంగ, పద్దం అశోక్, కొమరం శివ, వెంకటేష్, వంశీ, శెట్టిపల్లి వంశీ, కుర్సం అనిల్, కొండ్రు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!