ఖమ్మం:
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఖమ్మంలోని మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ కారులో చిక్కుకుని సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు.

కారులో మరెవరైనా ఉన్నారా..? ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఏమిటి..? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎస్సై అనిల్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 29








