పినపాక: స్వగ్రామమైన కొర్నువల్లి గ్రామంలో YRS యూత్ ఆధ్వర్యంలో పర్యావరణహితంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన YRS యూత్ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం సత్యనారాయణ, చందా లాలయ్య, చందా వసంతరావు, పోలబోయిన కృష్ణారావు, రేగా సత్యనారాయణ, బుడగం రాము, మండల అధ్యక్షులు రావుల సోమయ్య, కొమరం రాంబాబు, గుమ్మడిల్లి ప్రసాద్, ఎగ్గడి శీను, YRS యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్
Post Views: 65








