అశ్వాపురం, సెప్టెంబర్ 20 (Y7 News Telugu): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుర్రం వారిగూడెం గ్రామానికి చెందిన జర్పుల సువాలి (60) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలు, ఏవైనా అనుమానితుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 25








