మణుగూరు, సెప్టెంబర్ 19 (వై7 న్యూస్ తెలుగు): మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
పోలీస్ స్టేషన్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ నాగబాబు, ఎస్ఐ నగేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పోలీస్ సిబ్బంది సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 36









