E-PAPER

అంగన్వాడీ ఇంటర్వ్యూలో ‘సెలెక్టివ్ ‘ రాజకీయం… కొన్ని సెంటర్లకే ఇంటర్వ్యూలు..అనే వై7 న్యూస్ తెలుగు కథనానికి మండల అధికారి స్పందన..


చింతూరు,( వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల అయిన అంగన్వాడీ ఆయా మరియ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ విషయం వై7 పాఠకులకు విదితమే. చింతూరు మండలంలో మొత్తం 47 ఖాళీలు సెంటర్లకు అభ్యర్ధుల నుడి దరఖాస్తు లు స్వీకరించారు. అనంతరం మొత్తం ఖాళీలకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా నిర్వహించడం జరిగింది. తాజాగా నిర్వహించిన మొత్తం 47 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించకుండా కొన్ని సెంటర్లకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించడం వెనుక కారణాలు ఏంటి అనేది అభ్యర్ధులు సందేహం వ్యక్తం చేసిన సందేహానికి. ఇప్పటికే దరఖాస్తులు చేసిన ఉన్న అభ్యర్ధులకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలా చేశారు..? కొంతమందిని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు…? దీని వెనుకు ఉన్న సందేహాలను అభ్యర్ధులు ఎందుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు..? అధికారులు ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్యూలు కొంత మంది అభ్యర్ధులను తో చేస్తున్నారో సంబంధించిన అధికారులు జోక్యం చేసుకొని సమాధానం చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు అంటూ వై7 న్యూస్ లో అంగన్వాడీ ఇంటర్వ్యూలో సెలెక్టివ్ రాజకీయం… కొంతమందికే ఇంటర్వ్యూ అనే కథనం ప్రచురితమైంది..వెంటనే స్పందించిన చింతూరు మండలం సిడిపిఓ జయ లక్ష్మి, 11 సెంటర్ల దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ రద్దుకు గల కారణాలును, చరవాణి ద్వారా సమాచారం అందించి, వారి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!