పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు
కూనవరం, (వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 18:

సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాసరావు మృతి పార్టీకి,కుటుంబానికి తీరని లోటని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు అన్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని సీపీఎం నాయకులు, కార్యకర్తలు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ కర్నాటి శ్రీనివాసరావు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేశారని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. కూనవరం మండలంలో సీపీఎం పార్టీ విస్తరణకు ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన అనంతరం మండల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. ఆయన మృతి పార్టీకి, పార్టీ శ్రేణులకు తీరని లోటుగా మిగిలిపోతుందని అన్నారు.
శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు మోహన్ , సందీప్ లు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులు అండగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు,పాయం సీతారామయ్య, బాబు బొర్రయ్య,యర్రం శెట్టి శ్రీనివాసరావు,సీనియర్ నాయకులు తలగాని నాగరాజు, శ్యామల కృష్ణ బొగ్గా సుబ్బయ్య,నానుపల్లి వెంకటేశ్వరావు, నాగమని, అమ్మాజి రాజు, బాబురావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









