సోనీ సంస్థ ప్లేస్టేషన్ 5 గేమర్ల కోసం రెండు కొత్త వైర్లెస్ హెడ్సెట్లను ప్రకటించింది. ‘ప్లేస్టేషన్ పల్స్’, ‘పల్స్ ఎడ్జ్’ పేర్లతో వస్తున్న ఈ హెడ్సెట్లు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించేందుకు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ఆడియో స్పష్టతను మెరుగుపరిచేందుకు రెండు హెడ్సెట్లలోనూ ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లను ఉపయోగించారు. గేమింగ్ సమయంలో స్పష్టమైన సౌండ్‌ను అందించడమే లక్ష్యంగా వీటిని రూపొందించారు.
హై-ఎండ్ మోడల్ అయిన పల్స్ ఎడ్జ్‌లో యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC), డిటాచబుల్ బూమ్ మైక్రోఫోన్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. రెండు మోడళ్లు మిడ్నైట్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి.
Post Views: 4








