ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ ఆయుధ ప్యాకేజీ అందించనున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సుమారు 2.8 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా, అధికార వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి.
ఈ ప్రతిపాదిత ప్యాకేజీలో సుమారు 60,000 వార్హెడ్లు ఉండొచ్చని సమాచారం. వీటిలో 40,000 వరకు 2,000 పౌండ్ల భారీ బాంబులు, మిగిలినవి I-2000 పెనిట్రేటర్ తరహా ఆయుధాలు ఉండే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ ఆయుధ విక్రయ ప్రతిపాదనపై అమెరికా కాంగ్రెస్‌లోని సంబంధిత కమిటీలకు అనధికారికంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 16 నాటికి ఒప్పందం పూర్తిగా ఖరారు కాలేదని, అధికారికంగా కాంగ్రెస్‌కు నోటిఫై చేసే వరకు ప్రతిపాదిత ఆయుధ విక్రయాలపై వ్యాఖ్యానించబోమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.








