E-PAPER

దిశా సాలియన్ కేసులో ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌కు రూ.500 కోట్ల నోటీసు

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దిశ తండ్రి సతీశ్ సాలియన్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఎన్‌సీపీ (ఎస్పీ) నేత, మాజీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసు జారీ చేశారు.

తన కుమార్తె మృతిపై న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా చిత్రీకరించేలా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని సతీశ్ సాలియన్ నోటీసులో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఇందుకు ఏడు రోజుల గడువు ఇచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మరోవైపు, ఆదిత్య ఠాక్రే దిశా సాలియన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని, తన పేరును ఈ కేసుతో ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇప్పుడు న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా మారాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!