ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి కొత్త గేమింగ్ టాబ్లెట్ మార్కెట్లోకి రానుంది. కంపెనీ iQOO Pad Ultra లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 29న చైనాలో ఈ Android టాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
అదే రోజున iQOO 16 స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందు Weibo వేదికగా iQOO Pad Ultra డిజైన్, కలర్ ఆప్షన్స్‌తో పాటు పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది.
గేమింగ్ సమయంలో టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు PC-గ్రేడ్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను ఇందులో అందిస్తున్నట్లు iQOO ధృవీకరించింది. దీంతో గేమింగ్‌పై దృష్టి పెట్టిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ టాబ్లెట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Post Views: 3








