ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో ప్రత్యేక ఇసుక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ కళాకృతిని రూపొందించారు.
సుమారు 25 అడుగుల పొడవుతో రూపొందించిన ఈ ఇసుక శిల్పం పూరీ బీచ్‌లో సందర్శకులను ఆకర్షిస్తోంది. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ప్రత్యేక కళాకృతిని రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
ఈ ఇసుక శిల్పాన్ని ఏకంగా 2,500 మట్టి దీపాలతో అలంకరించారు. దీపాల వెలుగులతో శిల్పం ప్రత్యేకంగా కనిపించడంతో పూరీ బీచ్‌లో ఈ కళాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Post Views: 3








