E-PAPER

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ఆర్థిక చేయూత

మణుగూరు, సెప్టెంబర్ 16 (Y7 న్యూస్ తెలుగు):
అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుందరయ్య నగర్‌కు చెందిన చిరు వ్యాపారి ఎస్. సత్యనారాయణకు లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు సభ్యులు అండగా నిలిచారు. ఆయన పరిస్థితిని తెలుసుకున్న క్లబ్ సభ్యులు, దాతల సహకారంతో మొత్తం రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సహాయంలో లయన్ బేతంచర్ల వెంకటేశ్వరరావు రూ.5 వేలు, మైలవరం గ్రామానికి చెందిన మారెమల్ల నాగేశ్వరరావు రూ.5 వేలు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దొబ్బల వెంకటప్పయ్య రూ.వెయ్యి, ముత్తంశెట్టి నాగేశ్వరరావు రూ.వెయ్యి అందించారు.

ఈ నగదు సహాయాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు అధ్యక్షుడు దొబ్బల వెంకటప్పయ్య సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, లయన్ బేతంచర్ల వెంకటేశ్వరరావు, లయన్ ముత్తంశెట్టి నాగేశ్వరరావు, వెంకట్ రెడ్డి, మణుగూరు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ద్వారా మానవత్వాన్ని చాటుతున్న లయన్స్ క్లబ్ సభ్యులను స్థానికులు అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!