E-PAPER

రోబోలతోనే రోబోల తయారీ.. కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తున్న Xpeng

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ Xpeng రోబోటిక్స్‌ రంగంలో మరో కీలక అడుగు వేస్తోంది. వాహనాల తయారీతో పాటు హ్యూమనాయిడ్‌ రోబోల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న సంస్థ.. ఇప్పుడు రోబోలతోనే ఇతర రోబోలను తయారు చేసే అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త ఫ్యాక్టరీ రోబోటిక్స్‌ రంగంలో సంస్థ భవిష్యత్‌ ప్రణాళికలకు కీలకంగా మారనుంది.

ఈ ఉత్పత్తి కేంద్రంలో పారిశ్రామిక యంత్రాలు, ఆటోమేషన్‌ టెక్నాలజీ సాయంతో హ్యూమనాయిడ్‌ రోబోలను తయారు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తయారీ ప్రక్రియలో మానవ ప్రమేయాన్ని తగ్గించి, రోబోట్ల సహకారంతోనే రోబోలను రూపొందించే విధానాన్ని Xpeng అభివృద్ధి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున రోబోలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోను Xpeng విడుదల చేసింది. ఇందులో రోబోట్ల తయారీకి ఉపయోగించే అధునాతన పారిశ్రామిక వ్యవస్థలను ప్రదర్శించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం నుంచి రోబోటిక్స్‌ వైపు Xpeng వేస్తున్న అడుగులు టెక్నాలజీ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్తులో హ్యూమనాయిడ్‌ రోబోల భారీ ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!